The video went viral after it showed how officials used the Archimedes principle to rescue the elephant calf from well.
#ElephantStuckInWell
#ViralVideo
#forestdepartment
#Archimedesprinciple
#Jharkhand
#elephantcalf
#socialmedia
తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
జార్ఖండ్‌లో ఓ గున్న ఏనుగు దారి తప్పింది. మంద నుంచి తప్పిపోయిన ఈ పిల్ల ఏనుగు ఓ పాతబడ్డ బావిలోకి పడిపోయింది. బావిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చాలా సేపు ప్రయత్నించి విఫలమయ్యారు అధికారులు. వెంటనే అప్పుడెప్పుడో నేర్చుకున్న ఆర్కిమిడ్ సిద్ధాంతంను ప్రయోగించారు. ముందుగా బావిలోకి నీరును వదిలితే ఏనుగు తేలియాడుతుందని దీంతో దాన్ని బయటకు తీసుకురావడం చాలా సులభం అవుతుందని అధికారులు భావించారు. ఇక ఆపరేషన్ మొదలు పెట్టారు.
ముందుగా బావిలోకి నీరును వదిలారు. అనుకున్నట్లుగానే నీరు ఒక దశకు చేరుకున్న తర్వాత గున్న ఏనుగు నీటిపూ తేలియాడింది. నీరు క్రమంగా పెరిగే కొద్ది ఏనుగు కూడా పైకి తేలుతూ వచ్చింది. ఆపై ఏనుగును బయటకు తీసుకొచ్చారు.
ప్రాణాలతో బయటపడ్డ ఏనుగు బతుకు జీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీసింది. దీన్నంతటినీ వీడియోలో రికార్డు చేశారు.